BJP Leader Valluri Jayaprakash on Liquor: కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయి.. వాటిని పరిశీలించకుండా మా అధ్యక్షులపై అనుచిత వ్యాఖ్యలేంటీ!: వల్లూరి - BJP Leader Valluri Jayaprakash news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 6:08 PM IST
BJP Leader Valluri Jayaprakash on AP Excise Minister:రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారాయణస్వామిని ముఖ్యమంత్రి జగన్ వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి, ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
Valluri Jayaprakash Comments: కల్తీ మద్యంపై బీజేపీ నేత వల్లూరి జయప్రకాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ''రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా కల్తీ మద్యం తాగి, ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై అధికార పార్టీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల కష్టాలపై మేము స్పందిస్తుంటే.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వైసీపీ మంత్రులు నోరుపారేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు మంత్రి నారాయణస్వామికి తన శాఖ గురించి గుర్తుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మద్యం వల్లే తమ ఆరోగ్యాలు పాడైపోయినట్లు బాధితులు చెప్పారు. అబ్కారీ మంత్రి నారాయణస్వామి కనీసం బాధితులను పరామర్శించలేదు. కల్తీ మద్యంతో పేదల బతుకులను నాశనం చేశారు. రాకేష్ మాస్టర్ మరణం ఏపీలోని మద్యం తాగేనని అంటున్నారు. ఎక్సైజ్ మంత్రితో సీఎం రాజీనామా చేయించాలి.' అని ఆయన డిమాండ్ చేశారు.