జగన్ ప్రభుత్వం లక్షల ఎకరాలు కట్టబెడుతున్న షిర్డీసాయి, ఇండోసెల్ కంపెనీలు ఎవరి బినామీలో తేలాలి - బీజేపీ నేత దినకర్ - షిర్డీసాయి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 4:09 PM IST
BJP Leader Lanka Dinakar Comments:షిర్డీసాయి, ఇండోసెల్ కంపెనీలకు కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతో చెప్పాలంటూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై.. బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యుత్ ప్రాజెక్టుల మాటున జగన్ ప్రభుత్వం.. లక్షలాది ఎకరాలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. అక్రమాలపై 7 నెలల క్రితమే ఆధారాలను బయటపెడితే, ఇప్పటిదాకా ఎలాంటి సమాధానం లేదని దుయ్యబట్టారు.
Lanka Dinakar Comments: ''విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు అక్రమాలపై ప్రభుత్వ నుంచి స్పందనేది..?, షిర్డీసాయి, ఇండోసెల్ కంపెనీలు ఎవరి బినామీలో తేలాలి..?, షిర్డీసాయి, ఇండోసెల్‌కు కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతో చెప్పాలి..?, షిర్డీసాయి, ఇండోసెల్ కంపెనీలకు నిర్వహణ అనుభవమెంత..?, సూట్‌కేసు కంపెనీల ద్వారా వచ్చే నిధులు ఎవరివో తేలాలి..?, పెట్టుబడుల సదస్సు ఒప్పందాలకు ముందే రాష్ట్ర ప్రభుత్వ జీవోలా..?. లక్షల ఎకరాల నిలువు దోపిడీకి తెరలేపుతూ జీవోలు ఇచ్చారు. అర్హత లేని కంపెనీలకు 2.50 లక్షల ఎకరాలు కట్టబెట్టారు. రాయలసీమలోనే దాదాపు 1.50 లక్షల ఎకరాలు దోచే ప్రయత్నం చేశారు. అస్మదీయులకే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల సప్లయ్ టెండర్లు ఇస్తున్నారు.'' అని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు.