ప్రజలు ఆలోచించుకోవాలి - ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? : పురందేశ్వరి - Purandeswari Comments on YSRCP Sand Mining
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 6:05 PM IST
BJP Leader Daggubati Purandeswari Visit Paderu :వైఎస్సార్సీపీ పాలనలో మాఫియా, ఇసుక తవ్వకాలు విరివిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యాచరణ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఏజెన్సీలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్మాణాలపై సమీక్షించారు. స్థానికంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల, జాతీయ రహదారి నిర్మాణ పనులు, బ్రిడ్జిలను ఆమె పరిశీలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేశారు.
Purandeswari Comments on YSRCP Sand Mining :ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. రహదారులు, మెడికల్ కాలేజీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతుందన్నారు. ఏజెన్సీలో వైసీపీ నేత రవిబాబు ఆధ్వర్యంలో బాక్సైట్, ఇసుక మాఫియా తవ్వకాలు విరివిగా జరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీ, సప్లై నిధులు పక్కదారి పట్టించి వైసీపీ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.
Purandeswari Comments on Adulterated Liquor in AP :పాడేరులో పర్యటించిన పురందేశ్వరి.. మద్యం తాగి మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబాన్ని కలిశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయించడం వలన మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రాజారావు అనే వ్యక్తి కల్తీ మద్యం సేవించి మృతి చెందినట్లు గుర్తు చేశారు. కుటుంబాన్ని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.