BJP Leader Budda Srikanth Reddy Comments: 'మా సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి' - బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు
BJP Leader Budda Srikanth Reddy Comments On Government : శ్రీశైల మహా క్షేత్రంలో దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూములను గుర్తించినట్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ శ్రీశైలం నియోజకవర్గం ఇంచార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శ్రీశైల దేవస్థానానికి చెందిన 100 ఎకరాల భూముల్లో హిందువులకు పక్కా గృహాలను ఎందుకు నిర్మించడం లేదని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో నివసించే మైనార్టీలను సున్నిపెంటకు తరలించేందుకు, ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేసినప్పటికీ ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం 2 వేల గృహాలు మంజూరు చేస్తే వాటిని నిర్మించకుండా తాత్సారం చేస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డి వైఖరిని త్వరలోనే జాబితాతో సహా బయట పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. తాను ఇచ్చే సవాల్‌ను స్వీకరించడానికి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీశైలం, సున్నిపెంట వాసుల తాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాల్సి ఉండగా 20 ఇళ్లకు ఒక కుళాయి ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తీరుపై బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.