BJP Leader Bhanu Prakash Reddy on Tirumala Security ఏమిటీ వరుస వైఫల్యాలు.. తిరుమల భద్రతను కేంద్ర బలగాలకు అప్పగించాలి: భానుప్రకాష్‌రెడ్డి - BJP Leader Bhanu Prakash Reddy
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 7:44 PM IST
BJP Leader Bhanu Prakash Reddy on Tirumala Security: తిరుమలలో గత కొద్ది రోజులుగా వరుసగా భద్రతా వైఫల్యాలు జరగడం బాధాకరమని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ధర్మరథం ఎత్తుకెళ్లిన నిందితుడిని ఇప్పటిదాకా అధికారులు పట్టుకోకపోవడంపై భానుప్రకాష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన శ్రీవారి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ వేలాది సీసీ కెమెరాలు ఉన్నా ప్రయోజనం లేదనీ, తిరుమల భద్రతా వ్యవహారాన్ని కేంద్ర బలగాలకు అప్పగించాలని కోరారు. అలాంటి ప్రతిపాదనలు తితిదే.. కేంద్రానికి పంపితే తన వంతు చొరవ చూపుతానని తెలియజేశారు. అదే విధంగా శేషాచల అటవీ మార్గం ద్వారా కొన్ని వేల కోట్ల ఎర్రచందనం బయటకు పోతోందని అన్నారు. దీనిపై తితిదే అధికారులు కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అనే విషయాలను భక్తులకు సైతం తెలియజేయాలని అన్నారు. ఇవాళ విఐపీ విరామ దర్శన సమయంలో భానుప్రకాశ్‌తో పాటు కేంద్ర మంత్రి మురుగన్, నటుడు అశ్విన్‌లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.