ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YV Subbareddy on Amit Shah

ETV Bharat / videos

YV Subbareddy on Amit Shah: "టీడీపీ ట్రాప్​లో బీజేపీ.. అమిత్​ షా ప్రసంగమంతా వారి మాటలే" - వైవీ సుబ్బారెడ్డి

By

Published : Jun 12, 2023, 3:35 PM IST

YV Subbareddy on Amit Shah Comments: తెలుగుదేశం పార్టీ ట్రాప్​లో బీజేపీ పడిందని.. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విశాఖలోని జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయం శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల మాటలే ప్రసంగంలో అమిత్ షా మాట్లాడారని అన్నారు. అసలు వైజాగ్ అమిత్​ షా నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్​పై ఎవరున్నారో తెలుసు కదా అని ప్రశ్నించిన ఆయన..స్టేజ్​పై ఉన్నవారంతా టీడీపీ నాయకులే అని వ్యాఖ్యానించారు. పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నాయకులు స్టేజ్​పై ఉన్నారన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీతో మిత్రపక్షంగా కొనసాగిన బీజేపీ అప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం లేదా అని ఆరోపించారు. అమిత్ షా వైజాగ్ వచ్చి.. ఈ ప్రాంతం గురించి ఒక్క మాట చెప్పకపోవడం దారుణమని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడరని.. విశాఖలో ఫార్మా రంగం అభివృద్ధి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్​రెడ్డి అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details