ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP Dalitha Atmiya Sabha in Vijayawada

ETV Bharat / videos

సంక్షేమాన్ని పట్టించుకోకుండా దళితులపై వైసీపీ ప్రభుత్వ పెత్తనం: పురందేశ్వరి - బీజేపీ పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 10:58 PM IST

BJP Dalitha Atmiya Sabha in Vijayawada: దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం 40వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటి లెక్కలను, వివరాలను బహిరంగపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. దళితులపై వైసీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారే తప్ప వారి అభివృద్ధి, సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. 

విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నారాయణస్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్​తో పాటు పురందేశ్వరి పాల్గొన్నారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులను దారి మళ్లించి నేతలు వారి జేబులు నింపుకొంటున్న ముఖ్యమంత్రి కావాలా? అని ప్రశ్నించారు.

వైసీపీ పాలనలో దళితులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, వేధింపులు పెరిగిపోయాయని సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు దళితులకు అండగా నిలుస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోగా, 27 పథకాలను రద్దు చేసి దళిత ద్రోహిగా మిగిలారని మండిపడ్డారు. బలహీనవర్గాలు, దళితులకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ఇస్తున్నా వాటికి పేర్లు మార్చడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చేసింది ఏమీ లేదని సభలో పాల్గొన్న నేతలు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details