ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP criticized Jagan

ETV Bharat / videos

ఇంతగా ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత మళ్లీ మీరెందుకు జగన్‌ !: బీజేపీ నేత సత్యకుమార్ - bjp on rythu bharosa

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 5:18 PM IST

BJP criticized Jagan visit to Puttaparthi: ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాలు తుగ్లక్‌ నిర్ణయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. జగ్లక్‌ పాలనలో తుగ్లక్‌ నిర్ణయాలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. సీఎం పర్యటన ఉంటే ప్రైవేట్‌ బడులకు మాత్రమే సెలవులు ప్రకటించడం.. ఉత్తుత్తి బటన్‌ నొక్కుడు సీఎం జగన్‌ సభలకు.. జనాలు కరవయ్యారని చెప్పకనే చెపుతున్నారా అని ప్రశ్నించారు. మందు, బిర్యానీలతో స్కూల్‌ బస్సుల్లో జనాన్ని తోలితే కానీ సగం సభ కూడా నిండటం లేదని ఆక్షేపించారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక బృందాలను బెదిరించి తరలిస్తే తప్ప సభ నడవడం లేదని అన్నారు. ఇంతగా ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత మళ్లీ మీరెందుకు రావాలి జగన్‌ అంటూ చురకలు అంటించారు.

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన రైతు భరోసా (Rythu Bharosa) నిధులు విడుదల కార్యక్రమం కోసం సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ... జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యన కోసం స్కూల్స్​కు సెలవు ప్రకటించడంపై... ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

ABOUT THE AUTHOR

...view details