vamsadhara residents bike rally: సమస్యలు పరిష్కరించాలని వంశధార నది నిర్వాసితుల బైక్ ర్యాలీ - Bike rally under the labor union in Srikakulam
vamsadhara residents bike rally : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో వంశధార నది నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని.. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తూరు నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీని.. అంబేడ్కర్ విగ్రహం వద్ద కొత్తూరు పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా అరెస్ట్‌లు చేసి స్టేషన్‌లో నిర్బంధించడం దుర్మార్గమని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు ఇవ్వాల్సిన అదనపు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడిఎఫ్ కుటుంబాల్లో కొద్దిమందికి మాత్రమే రెండు సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డి.పట్టా భూములకు పరిహారం చెల్లించాలని..పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్భంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని.. సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్‌తో పాటు గోవిందరావు, శంకర్ రావు, రామకృష్ణ, రాంబాబు, నూకరాజు, శ్రీనివాసరావు, షణ్ముఖరావు, సంజీవరావు.. తదితరులు పాల్గొన్నారు.