మలుపులో మృత్యు పిలుపు - అతివేగానికి ఇద్దరు బలి, మరొకరికి తీవ్రగాయాలు - విశాఖ స్టీల్ ప్లాంట్ఆక్సిడెంట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 5:46 PM IST
Bike Accident at Visakha Steel Plant :విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. గంగవరానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై స్టీల్ ప్లాంట్ నుంచి దేశపాత్రునిపాలెం రోడ్డులోకి వెళ్తున్నారు. ఆ సమయంలో సెక్టర్ 11 మలుపు వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణించడంతో బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
Bike Accident in Visakhapatnam : ముగ్గురు యువకులు ఒకే బైక్పై దేశపాత్రునిపాలెం రోడ్డువైపు వెళ్తుండగా ఒక్కసారిగా బండి అదుపు తప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోగా ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మూడో వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు అంబులెన్సును సంప్రదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.