కోనసీమ జిల్లాలో భారీ త్రాచుపాము - భయభ్రాంతులకు గురైన స్థానికులు - snake catching process in telugu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 10:02 PM IST
Big Snake in Konaseema District Mummidivaram: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా పాములు ప్రత్యక్షమవుతున్నాయి. గడచిన వారం రోజుల్లోనే ఇంటిలోను.. వంటింట్లోను.. పశువుల పాకల వద్ద ఇలా పలు ప్రదేశాలలో నాగుపాములు తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. కాగా తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ఒక ఇంటి వద్ద భారీ త్రాచు పాము కనిపించింది.
కోటిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటి వద్ద భారీ త్రాచుపామును చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. దీంతో కాసేపట్లో త్రాచుపాము ఉన్న ప్రదేశానికి స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ చేరుకున్నాడు. త్రాచుపామును బంధిస్తున్న దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల ఉన్నవారు భారీగా వచ్చారు. స్నేక్ క్యాచర్ పామును ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అనంతరం ఆ పామును సురక్షిత ప్రాంతంలో వదిలారు. దీంతో చాకచక్యంగా భారీ త్రాచుపామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.