Cutout fall down: సీఎం సభా వేదిక వద్ద కూలిన కటౌట్.. తప్పిన ప్రమాదం - CM Jagan public meeting
Cutout fall down: సీఎం జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదిక వద్ద పెను ప్రమాదం తప్పింది. సభ జరుగుతుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో.. ఎదురుగా ట్రంపెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఒక్కసారిగా నేలకొరిగింది. దాని కిందనే ఉన్న ఫైర్ ఇంజన్ వాహనం పై పడింది. కటౌట్ పడటంతో ఫైర్ ఇంజన్ వాహనం డ్యామేజ్ అయింది. అప్పటికే వర్షం పడుతుండగా దాని కిందనే ఉన్న కొందరు మహిళలు, యువత శబ్దం రావడంతో పరుగులు తీశారు. అదే స్థలంలో ఉండి ఉంటే సభ వేదిక వద్ద పెను ప్రమాదం జరిగి ఉండేదని పలువురు చెబుతున్నారు.
మరోపక్క సీఎం సభ జరుగుతుండగా వర్షానికి సభకు వచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వేదిక లోపలే టెంట్ల నుంచి వర్షం నీరు దారలుగా కురవడం వల్ల తడిసి ముద్దయిన పరిస్థితి కనిపించింది. అయితే సభ ముగుస్తున్న ఐదు నిమిషాలకు ముందే వర్షం తగ్గుముఖం పడడంతో... ఆ బురదలోంచి బయటికి వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.