Bhavishyathu Ku Guarantee Program: శ్రీకాకుళంలో భవిష్యత్‌కు గ్యారంటీ.. టీడీపీలో చేరిన 130 కుటుంబాలు.. - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ న్యూస్
Bhavishyathu Ku Guarantee Program: రాష్ట్రంలో అన్నిరకాల ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. వివిధ రకాల పన్నుల ద్వారా ఒక్కో కుటుంబం నుంచి దాదాపు 2 లక్షల రూపాయల వరకు సీఎం జగన్ వసూలు చేశారని ఆయన గుర్తు చేశారు. పిల్లల భవిష్యత్ బాగు పడాలంటే మళ్లీ చంద్రబాబుని సీఎం చేయాలని.. ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తాళభద్రలో టీడీపీ నేతలు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవి కుమార్, గౌతు శిరీష ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ పై వ్యాఖ్యలు చేశారు. తొలుత పలాసలోని టీడీపీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న తాళభద్ర వెళ్లారు. అక్కడ పలు పార్టీల నుంచి సుమారు 130 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఆ సందర్భంగా మాట్లాడిన కూన రవికుమార్, గౌతు శిరీష.. రాష్రంలో వైసీపీ పాలన, మంత్రి అప్పలరాజుపై దుమ్మెత్తి పోశారు.