ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bhavani_Deeksha_Begin_at_Kanaka_Durga_Temple

ETV Bharat / videos

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం - 27 వరకు దీక్షల స్వీకరణ - AP Latest News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 7:57 PM IST

Bhavani Deeksha Begin at Kanaka Durga Temple :విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు సందర్బంగా భవానీ మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు. నవంబరు 27 వరకు దీక్షల స్వీకరణకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీక్షా పీటం నందు ఆలయ ఉప ప్రధానార్చకులు వై. నాగరాజు శాస్త్రి, ఆచార్య గురులు.. భవానీలుగా దీక్ష చేపట్టిన భక్తులకు అమ్మవారి మాలధారణ చేసి, మండల దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా భవానీ దీక్షా మండపానికి తీసుకొచ్చారు. గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభించి, పుణ్యా హవచనము, మండపారాధన, కలశస్థాపన చేసి.. అమ్మవారికి ఆవాహన చేశారు. డిసెంబరు 13 నుంచి 17 వరకు అర్ధమండల దీక్ష కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా డిసెంబరు 26న మార్గశిర పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుంచి కలశజ్యోతి ఉత్సవం జరగనుంది. విజయవాడ సత్యనారాయణపురంలోని శివరామ కృష్ణక్షేత్రం నుంచి కలశ జ్యోతులు ప్రారంభమై అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి. జవవరి మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు భవనాదీక్ష విరమణకు వీలుగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details