తిరుమలగిరుల్లొ మంచు సోయగం - కనువిందుగా దైవ దర్శనం - తిరుమలలో కురుస్తున్న మంచు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 4:54 PM IST
|Updated : Dec 16, 2023, 5:29 PM IST
Beautiful Tirumala Hills :తిరుమలను మంచు కప్పేసింది. మిట్ట మధ్యాహ్నం కూడా మంచు కురుస్తుండటంతో ఏడుకొండలు మంచుకొండల్లా కనిపిస్తున్నాయి. తిరుమలలో ఇలాంటి వాతావరణాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని భక్తులు అంటున్నారు. మంచు అందాలను చూస్తుంటే ఊటీ, కొడైకెనాల్‌లో ఉన్నట్లు ఉందని చెబుతున్నారు. దైవ దర్శనం, కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగాల వీక్షణంతో పరవశించి పోయామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిని మంచు దుప్పట్లు కమ్మేశాయి. ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
Snowfall in Tirumala :శ్రీవారి ఆలయంతో పాటు పొగమంచు తిరుమల అంతటా వ్యాపించి ఆహ్లాదాన్ని వాతావరణం సంతరించుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ప్రకృతి అందాలు చూసి పులకించిపోతున్నారు. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను ఇదివరకెన్నడూ చూడని అందాలు పలకరిస్తున్నాయి. తిరుమల కనుమ రహదారుల్లో మేఘాలు చేతికందేంత ఎత్తులో జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలితీవ్రత బాగా పెరగడంతో కొందరు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు.