ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bear_ is_ Roaming_ in_ Mahanandi_ Temple_ Premises

ETV Bharat / videos

Bear is Roaming in Mahanandi Temple Premises: మహానంది ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో భక్తులు - ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 8:47 AM IST

Bear is Roaming in Mahanandi Temple Premises : నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో మరో సారి ఎలుగుబంటిని స్థానికులు గుర్తించారు. ఆలయ అవరణలో ఈవో కార్యాలయ పాత భవనం వెనుక ప్రాంతంలో తిరుగుతున్న ఎలుగు బంటిని గమనించిన స్థానికులు కేకలు వేసి తరిమి వేశారు. పది రోజుల క్రితం మహానందిలో సంచరిస్తున్న ఓ ఎలుగు బంటిని గుర్తించి అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని అడవిలో వదిలి వేశారు . మరో సారి ఎలుగు బంటి కనపడడంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. అడవిలో వదిలి పెట్టిన ఎలుగు బంటి తిరిగి వచ్చిందా.. ఇంకో ఎలుగు బంటి వచ్చిందా అనే అంశం పై సందేహంగా ఉందని భక్తులు అన్నారు.  

ఇప్పటికే తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతుండగా మహానంది ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  కొద్ది రోజుల క్రితం తిరుమల నడక దారిలో మరో చిరుత సంచారం సంచలనంగా మారింది. అలిపిరి నడక మార్గం ఏడో మైలు వద్ద నరసింహ స్వామి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత సంచరించడాన్ని ట్రాప్​ కెమెరాలలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో ఇదే ప్రాంతంలో బాలిక లక్షితపై ఓ చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే.. టీటీడీ ప్రభుత్వ అటవీశాఖల ఆధ్వర్యంలో బోన్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4 చిరుతలను పట్టుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details