వైసీపీలో బీసీలకు స్థానం లేదు - జగన్ను నమ్మి మోసపోవద్దు : బీసీ సెల్ రాష్ట్ర నేత ఓబయ్య - కడప తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2023, 7:29 PM IST
BC Cell State General Secretary C. Obiah Resigned :వైసీపీ పార్టీ నాయకులు మోసం చేశారని వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన పార్టీ నేత బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.ఓబయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ తన పదవిని రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, పార్టీ కోసం ఆస్తులు పొగొట్టుకున్న తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఓబయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని అన్ని విధాలా నష్టపోయానని, ఇప్పుడు రోడ్డున పడ్డానని వాపోయారు. బీసీ అనే కారణం చేతనే సీఎం జగన్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
Obiah Fires on YSRCP, Jagan : వైసీపీ పార్టీనీ నమ్ముకొని ఏ ఒక్కరూ నష్టపోవద్దని కోరారు. బంధువులను కూడా కాదనుకొని వైఎస్సార్ పార్టీకి మద్ధతుగా ఉన్నాను. ఆస్తులన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో సాయం కావాలని కోరితే పార్టీ కనీసం పట్టించుకోవడం లేదు. ఎన్ని సార్లు మంత్రులకు, సీఎంకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఈ రోజు పార్టీకి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది అని తెలిపారు.