ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bapatla_MP_Nandigam_Suresh_Followers_Cheating

ETV Bharat / videos

ఇసుక రీచ్‌లు ఇప్పిస్తానని ఎంపీ అనుచరుడి మోసం - ఆత్మహత్యే శరణ్యమంటూ బాధితుడి గగ్గోలు - ఏపీలో వైసీపీ నేతలు అరాచకాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 12:44 PM IST

Bapatla MP Nandigam Suresh Followers Cheating :వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్లె సన్నీపై గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని బాధితుడు షేక్ ముజిబుర్ రహమాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీని కోరారు. పూర్తి వివరాలివీ.

Complaint Against Nandigam Suresh Follower Repalle Sunny in Guntur District SP Office :గుంటూరుకు చెందిన రహమాన్​కు ఎంపీ నందిగం సురేష్ గన్​మెన్ ద్వారా రేపల్లె సన్నీ పరిచయమయ్యాడు. ఇసుక రీచ్​లు ఇప్పిస్తానని సన్నీ తన నుంచి 2020లో సుమారు 25 లక్షలు రూపాయలను రెండు విడతలుగా తీసుకున్నాడని బాధితుడు రహమాన్ తెలిపాడు. డబ్బులు ఇవ్వకపోవటంతో బాధితుడు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో సీఎం క్యాంప్ కార్యాలయానికి దగ్గర్లో వాల్ పోస్టర్​ను రహమాన్ అతికించాడు. దీంతో పరువుకు నష్టం వాటిల్లిందని నందిగం సురేష్ అనుచరులు లీగల్ నోటీసులు పంపారని బాధితుడు తెలిపారు. నష్టపోయిన తనపైనే కేసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లలో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని, తనకు న్యాయం జరగకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని కన్నీరుమున్నీరవుతున్నారు. రహమాన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షిబ్లీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details