ఆంధ్రప్రదేశ్

andhra pradesh

accident

ETV Bharat / videos

ఇద్దరు కూలీల ప్రాణాలు తీసిన మంత్రి బ్యానర్లు - నంద్యాల జిల్లాలో ప్రమాదం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 8:35 PM IST

Two Persons Died in Nandhyala District : మంత్రి బ్యానర్లు ఇద్దరు కూలీల ప్రాణాలు తీశాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో ఆర్థికమంత్రి బుగ్గన అభివృద్ధి పనులకు సంబంధించిన బ్యానర్లను కట్టేందుకు ఆరుగురు కూలీలతో ఐచర్​ వాహనం బయలుదేరింది. ప్యాపిలి మండలంలోని పీఆర్​ పల్లెలో రెండు బ్యానర్లను కట్టారు. అనంతరం జక్కసానిగుంట్ల గ్రామానికి వెళ్తుండగా గాలి బలంగా వీచడం వల్ల బ్యానర్లు కూలీల మీద పడ్డాయి. ఈ నేపథ్యంలో వెనక ఉన్న ఇద్దరు కూలీలు వాహనం నుంచి కింద పడ్డారు.

Two Laborers Died After Falling From a Vehicle Carrying Banners :ఈ ప్రమాదంలో బేతంచర్ల పట్టణానికి చెందిన సాయి శశాంక్​ అక్కడికక్కడే మృతి చెందాడు. డోన్​ పట్టణానికి చెందిన లాల్​ బాషా పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లాల్​ బాషా మృతి చెందాడు. రోజు కూలి రూ.400 చెప్పడం వల్ల బ్యానర్లు కట్టేందుకు వెళ్లారు. ఆ బ్యానర్లే వారి ప్రాణాలు తీస్తాయని ఊహించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details