ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bandlamudi Stalin Babu Mala Mahanadu president

ETV Bharat / videos

మార్పు మొదలైంది - వైసీపీ కొత్త ఇన్​ఛార్జ్​ల నియామకంతో అసంతృప్తి సెగలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 5:47 PM IST

Bandlamudi Stalin Babu  Mala Mahanadu president: వైసీపీలో లుకలుకలు మెుదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయిలో ప్రభావం చూపుతారు అనుకునే నేతలు, ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. పార్టీలో ఇమడలేం అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన వైసీపీ అధిష్ఠానం స్థానికంగా పార్టీపై వ్యతిరేకత, నేతలపై వ్యతిరేకత,  గెలుపు గుర్రాలు లాంటి అనేక కారణాలతో, వైసీపీ నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఆయా నియోజకవర్గాల్లో పలువురు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

 తాజాగా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ తరఫున మాలలకే సీటు కేటాయించాలని, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ నుంచి నిలబడిన అభ్యర్థిని తాము గెలిపించుకున్నామని అన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా మాలల ఓట్లే ఉన్నాయని తెలిపారు. అలాంటిది మాలలకు కాకుండా వేరే వర్గం వారికి సీటు కేటాయించడం సరికాదన్నారు. ఎంపీ నందిగం సురేష్ కావాలని మాలలకు, మాదిగలకు మధ్య చిచ్చు పెడుతున్నారని స్టాలిన్ బాబు ఆరోపించారు. రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని పేర్కొన్నారు. 

ప్రత్తిపాడులో స్థానికేతరులను తీసుకువచ్చి సీటు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. మాలలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మాలలకు కాకుండా ఎవ్వరిని తీసుకువచ్చినా వైసీపీకి ఓట్లు పడవని హెచ్చరించారు. అధిష్ఠానం స్పందించి ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా మాలలను నియమించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని స్టాలిన్ బాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details