ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Balayya welcomed Superstar Rajinikanth

ETV Bharat / videos

Superstar Rajinikanth: విజయవాడలో తలైవా.. బాలయ్యను చూడగానే ఒక్కసారిగా..! - Rajinikanth reached Vijayawada

By

Published : Apr 28, 2023, 5:06 PM IST

Balayya welcomed Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు అయన విజయవాడ వచ్చారు. నందమూరి బాలకృష్ణ, సావనీర్ కమిటీ సభ్యుడు టీడీ జనార్ధన్​లు విమానాశ్రయంలో రజినీకాంత్​ని రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే రజనీకాంత్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్-బాలయ్య ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేనేటి విందు ఇచ్చారు.

సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్​లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన 2 పుస్తకాల విడుదల చేయనున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్​పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details