ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bail_Granted_to_Chirala_Margadarsi_Branch

ETV Bharat / videos

Bail Granted to Chirala Margadarsi Branch Manager: చీరాల ‘మార్గదర్శి’ మేనేజర్‌కు బెయిల్‌ - మార్గదర్శి కేసు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 11:18 AM IST

Bail Granted to Chirala Margadarsi Branch Manager: బాపట్ల జిల్లా చీరాల మార్గదర్శి మేనేజర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ చీరాల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ నిషాద్‌నాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలని చీరాల ఒకటో పట్టణ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు. దీంతో ఒంగోలు జైలు నుంచి మేనేజర్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు బీసీ కాలనీకి చెందిన బి.వేళంగిణి ఫిర్యాదు చేశారంటూ చీరాల ఒకటో పట్టణ పోలీసులు మేనేజర్‌పై ఫోర్జరీతో పాటు పలు సెక్షన్ల కింద నేరం మోపి ఈ నెల 22న కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వచ్చే నెల 5వరకు రిమాండ్‌ విధించారు. మార్గదర్శి తరఫున న్యాయవాది రమేష్‌బాబు బెయిల్‌ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే పోలీసులు అవసరమైన సమాచారాన్ని మేనేజర్‌ నుంచి డాక్యుమెంట్ల రూపంలో పొందారని, రిమాండ్‌కు వెళ్లే వరకు ఆయన పోలీసు కస్టడీలోనే ఉన్నారని తిరిగి ప్రత్యేకంగా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో న్యాయమూర్తి ఏకీభవించారు. పోలీసు కస్టడీ అవసరం లేదని పిటిషన్‌ డిస్మిస్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details