అరాచకాలు, అక్రమాలు నశించాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి - ప్రవీణ్ కుమార్ రెడ్డి - ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 12:57 PM IST
Babu Surety Bhavisyathu Guarantee Program In Proddutur: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు పోవాలంటే టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని తెలుపుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.
టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి టీడీపీని గెలిపించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు వంటివి నశించాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.