బాబు ష్యూరిటీ కార్యక్రమంలో అరుదైన ఘటన, బిడ్డ భవిష్యత్తు కోసం 'బ్రాహ్మణి'గా నామకరణం - ఏపీ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 12:33 PM IST
TDP Babu Surety Bhavishyathu ku Guarantee Program: పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని ఇరగవరంలో 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గొల్ల మాలపల్లిగ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 'బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం' నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ రాబోయే కాలంలో ప్రజలు కలిగే ప్రయోజనాలను వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులైన ఒక యువ జంట తమకు కొద్ది రోజుల క్రితం పుట్టిన బిడ్డకు నామకరణం చేయాలని కోరారు.
Baby Naming Ceremony in Babu Surety Program: దీంతో భోగి బాలు, శిరీష దంపతుల ఆడబిడ్డకు బ్రాహ్మణి అని ఆరిమిల్లి రాధాకృష్ణ నామకరణం చేశారు. సాంప్రదాయబద్ధంగా బ్రాహ్మణి పేరును పసిబిడ్డ చెవిలో మూడు సార్లు ఉచ్ఛరించారు. రాధాకృష్ణ చేతుల మీదుగా తమ బిడ్డకు బ్రాహ్మణి అని నామకరణం జరగడం పట్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అందరి భవిష్యత్తు బాగుండాలని 'బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ' నిర్వహించే సమయంలో.. బిడ్డ భవిష్యత్తును బాగుండాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు నామకరణం చేయమని కోరడంపై రాధాకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.