ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ayyappa Swamy Koti Bilwarchana in Tuni

ETV Bharat / videos

మార్మోగిన శరణుఘోష - ఘనంగా కోటి బిల్వార్చన, పడి పూజా మహోత్సవం - ఏపీలో అయ్యప్ప పడిపూజ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 7:39 PM IST

Ayyappa Swamy Koti Bilwarchana in Tuni:కాకినాడ జిల్లా తునిలో అయ్యప్పస్వామి కోటి బిల్వార్చన పడిపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తునితో పాటుగా చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివస్తారన్న సమాచారంతో తుని జాతీయ రహదారి వద్ద ఉన్న డిగ్రీ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శబరిమల సన్నిధానం నుంచి ఆలయ పూజారి తంత్రి, పందళ రాజ వంశానికి చెందిన పలువురు ప్రముఖులు, శబరిమల ఆలయ వాయిద్యకారులు, చండా మేళా, స్వామివారి ఆభరణాలను ఆలయానికి తీసుకొచ్చే తిరువాభరణం స్వాములు పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా దంపతులతో పాటుగా పలువురు నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తుని, పాయకరావుపేటలో అయ్యప్ప స్వాములు భారీ ప్రదర్శన చేశారు. భక్తులు వేలాదిగా తరలి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details