వర్గపోరులో పోలీసుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి - ఆత్మకూర్ తాజా నేర వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 12:04 PM IST
|Updated : Nov 4, 2023, 1:43 PM IST
Ayyappa Swami devotee Suicide in Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బైక్ మెకానిక్‌ల మధ్య చెలరేగిన వివాదం ఓ యువకుడు ఆత్మహత్యకు దారి తీసింది. బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు ఆత్మకూరు పట్టణంలోని తన పిన్ని వద్ద ఉంటూ బైక్ మెకానిక్ షాప్‌లో గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో బైక్ మెకానిక్ షాపుకు చెందిన వారితో వినయ్‌కు పాత గొడవలు ఉండడంతో ఇటీవల ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ వివాదం కాస్త పెద్దదవ్వడంతో మరో షాపునకు చెందిన మెకానిక్ షబ్బీర్‌తో పాటు నలుగురు యువకులు వినయ్ షాపు వద్దకు వచ్చి అతడ్ని తీవ్రంగా కొట్టారు. దీంతో పోలీసులు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన వినయ్ ఈ నెల 24 వ తేదీన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే మెకానిక్ షబ్బీర్ సహా మరో నలుగురు యువకులు వినయ్‌పై దాడికి పాల్పడుతున్న ఘటన సీసీ ఫుటేజ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు చలించి పోయారు.
Bike Mechanics Fight in Atmakur 2023 : పోలీసులు, యువకులు దాడి చేయడంతో వినయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వినయ్ పిన్ని ఆరోపించింది. తన బిడ్డ చావుకి కారణమైన షబ్బీర్, మిగిలిన వారి పైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వినయ్ మృతి చెందింది బుచ్చి రెడ్డి పాళెం. కాబట్టి మీరు అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. బుచ్చిరెడ్డి పాళెంలో ఫిర్యాదు చేయగా పి అత్మకూరులో ఇవ్వాలని సూచించారు. పోలీసుల వైఖరికి విసిగిపోయిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు.
మరో వైపు అయ్యప్ప మాలలో ఉన్న వినయ్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షంచాలంటూ అయ్యప్ప స్వాములు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు.