ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ayyanna_Patrudu_Fires_on_Narsipatnam_police

ETV Bharat / videos

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా ?: అయ్యన్నపాత్రుడు - TDP Leader Ayyanna Patrudu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 4:11 PM IST

Ayyanna Patrudu Fires on Narsipatnam Police: మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది ఈలోపు పద్ధతి మార్చుకుంటే సరే లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం పోలీసులను హెచ్చరించారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులను పెట్టారని టీడీపీ కార్యకర్తల ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లడాన్ని అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఖండించారు. 

TDP Leader Ayyanna Patrudu: అధికార పార్టీ నాయకులు చెప్పారని ఎవరినైనా అక్రమంగా అరెస్టు చేయడం, దౌర్జన్యం చేయడం తగదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎంతమంది పొస్టులు పెడితే అంతమందిని అరెస్టు చేస్తారా అని అయ్యన్న పోలీసులను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర పాలనలో చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఎంతో మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అయ్యన్న మండిపడ్డారు. వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, పోలీసుల తమ తీరును మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.  

ABOUT THE AUTHOR

...view details