అయోధ్య రాముని ఆలయం నిర్మాణానికి అందరూ మద్దతు తెలపాలి: అయ్యన్న పాత్రుడు - Ayyana Patrudu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 8:03 PM IST
Ayodhya Rama Talambrala Program Start in Ayyana Patrudu: హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అయోధ్య రాముని తలంబ్రాలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఆయన స్వామివారికి పుష్పాలతో, పాలతో అభిషేకం చేశారు. పూజ కార్యక్రమం అనంతరం పండితులు ఆశీర్వదించారు. అనంతరం తలంబ్రాలను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని అయ్యన్నపాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ఎప్పటినుంచో రామమందిరం నిర్మించాలి అనుకున్నా అది జరగలేదన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ హయాంలో రామమందిరం నిర్మించుకునే అవకాశం కలిగిందని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య రాముని ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అందరూ మద్దతు తెలపాలని అయ్యన్న పిలుపునిచ్చారు. పూజ చేసిన అక్షింతాలను, రామమందిర కరపత్రాన్ని అయోధ్యకు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. హిందూ మతము వాతాపి కోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఆలయ ప్రాంగణంలో ఉన్నవారంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.