ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Avinash_Kommireddy_Arrest_in_E_Challan_Scam

ETV Bharat / videos

పోలీసు శాఖలో ఈ-చలానా స్కామ్‌- ఏ1 అవినాష్ కొమ్మిరెడ్డి అరెస్ట్ - Traffic E Challan Scam In Ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 8:44 AM IST

Avinash Kommireddy Arrest in E Challan Scam :పోలీసు శాఖలో 36.58 కోట్ల రూపాయల ఈ-చలానా కుంభకోణం కేసులో A-1 అవినాష్ కొమ్మిరెడ్డిని అరెస్టు చేసినట్టు గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు (Guntur Range IG Palaraju) తెలిపారు. అవినాష్‌ అమెజాన్‌ క్రౌడ్‌ సర్వీసెస్‌ (Amazon Crowd Services) కొనుగోలు చేసి, వాటిని వేరే కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా డబ్బులు మళ్లించారని వెల్లడించారు. నిందితులకు సంబంధించిన మొత్తం 16 ఆస్తులను జప్తు చేశామని, వాటి విలువ 13 కోట్ల రూపాయలు ఉంటుందని వివరించారు. దారి మళ్లించిన డబ్బుతో ఒంగోలు, హైదరాబాద్‌ లాంటి చోట్ల స్థలాలు కొనుగోలు చేశారని, బ్యాంకులో ఎఫ్‌డీలు చేసినట్టు చెప్పారు. కుంభకోణానికి సంబంధించి సమగ్ర విచారణకు అంతర్గత కమిటీ వేసినట్టు పాలరాజు స్పష్టం చేశారు.

Guntur Range IG Palaraju on E Challan Scam in Police Department :ఈ-చలానా కుంభకోణం కేసులో A-2గా ఉన్న రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు అన్నారు. ప్రధాన నిందితుడు అవినాష్‌ కొమ్మిరెడ్డి కోసం ప్రత్యేక బృందాలు 3 రాష్ట్రాల్లో గాలించి అరెస్టు చేశాయని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details