ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Auto_Overturned_in_Jagananna_Colony

ETV Bharat / videos

జగనన్న కాలనీలో ఆటో బోల్తా - కొండ ఎక్కాలంటే లబ్ధిదారులకు చుక్కలే - జగనన్న కాలనీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 1:58 PM IST

Auto Overturned in Jagananna Colony: జగనన్న కాలనీలో ఓ ఆటో బోల్తా పడింది. కాలనీపై ఆటో ఎలా బోల్తా పడిందా అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ కాలనీ కొండ ప్రాంతంలోనే ఉంది. దీనికి తోడు రహదారులు సైతం అధ్వానంగా ఉన్నాయి. నంద్యాల జిల్లా డోన్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్ధికమంత్రి బుగ్గన ఇలాకాలో డోన్ జాతీయరహదారి పక్కనే ఉన్న దొరపల్లి గుట్టలో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు 12 వందల గృహాలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుడు సామగ్రిని కాలనీలోకి తీసుకెళ్తుండగా ఆటో బోల్తా పడింది. 

ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెళ్లి బోల్తాపడిన ఆటోను పైకి లేపారు. దొరపల్లి గుట్ట ఎత్తుగా ఉండటంతోపాటు కాలనీలో రహదారులు బాగాలేవని లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుట్టలో నిర్మాణానికి అవసరమయ్యే సరుకులు తీసుకుని వెళ్లాలంటేనే లబ్దిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి తల ప్రాణం తోకకు వస్తుందని పలువురు లబ్దిదారులు వాపోయారు. 

ABOUT THE AUTHOR

...view details