హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ - హత్యాయత్నం కేసు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 4:08 PM IST
Attempt to Murder Case Accused Arrest: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం మహాత్మాగాంధీ రోడ్డులో ఈనెల 7న బైక్ మెకానిక్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మెకానిక్ శ్రీధర్ మరో యువకుడి మధ్య చోటు చేసుకున్న వివాదం హత్యాయత్నానికి కారణమైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన బాలును ప్రశ్నించేందుకు శ్రీధర్ అతని దుకాణానికి వెళ్లాడు.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకున్నారు. శ్రీధర్‌పై బాలు అతడి స్నేహితుడు పవన్ కత్తితో దాడి(Attack With A Knife) చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన శ్రీధర్‌ను ఆసుపత్రికి తరలించారు. వెంటనే దీనిపై పోలీసులు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలు, అతడి మిత్రుడు పవన్‌తో పాటు వీరిని ప్రోత్సహించిన ఇసాక్‌ను అరెస్టు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు పంపినట్లు కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.