ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Attack_on_TDP_Leader_in_Kurnool_District

ETV Bharat / videos

ప్రెస్​మీట్​లో విమర్శించారని దారుణం - టీడీపీ నాయకుడిపై వైసీపీ నేతల దాడి - ఏపీలో టీడీపీ నేతలపై దాడులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 11:52 AM IST

Attack on TDP Leader in Kurnool District: కర్నూలు జిల్లా గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు బేతాల బడేసాబ్​పై వైసీపీకి చెందిన కొందరు దాడి చేశారు. పొలంలో ఉండగా వైస్సార్సీపీకి చెందిన వారు కట్టెలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బేతాల బడేసాబ్​ను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నాయకులు కట్టెలతో తనపై దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు బేతాల బడేసాబ్ తెలిపారు. 

గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు. అధికార పార్టీ వారి దాడులకు భయడపమని, ప్రెస్ మీట్​లో విమర్శించారని బడేసాబ్​ను అంతమొందించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. విమర్శలు చేస్తే దానిని ఖండించుకోవాలి కానీ ఇలా దాడులకు పాల్పడటం సరికాదని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు  పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. విమర్శలు చేస్తే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ డాదులతో భయపడేదే లేదని పేర్కొన్నారు. బడేసాబ్​పై దాడి కక్షపూరితమని, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని బీవీ జయనాగేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details