ఆంధ్రప్రదేశ్

andhra pradesh

attack_on_minor_due_to_theft_accusation

ETV Bharat / videos

Attack on Minor Due to Theft Accusation: దొంగతనం నెపంతో దళిత మైనర్​పై దాడి.. ఆందోళనలో బాధితుడి తల్లిదండ్రులు - అంబవరం గ్రామానికి చెందిన మైనర్​పై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 9:19 PM IST

Attack on Minor Due to Theft Accusation: దొంగతాననికి పాల్పడ్డాడనే నెపంతో మైనర్​ను నిర్బంధించి దాడి చేసిన ఘటన వైఎస్సార్​ కడప జిల్లాలో చోటు చేసుకుంది. దుకాణానికి వెళ్లిన తమ కుమారుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో.. ఆచూకి కోసం వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులపై సైతం దాడి దిగారు. తమపై దాడి చేసిందే కాకుండా దళితులు ఊళ్లో ఉండకూడదని.. ఊరు విడిచి వెళ్లాలని అంటున్నారని బాధితులు ఆరోపించారు. తమపై దాడి చేసింది ఉన్నతవర్గానికి చెందిన వారని..  న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

బాధితుల వివరాల ప్రకారం.. జిల్లాలోని వల్లూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన వాసు అనే బాలుడు.. సరుకుల కోసం అదే గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్లాడు. దీంతో ఇంట్లో దొంగతనం చేశాడని ఆరోపిస్తూ.. ఓబుల్​ రెడ్డి అనే వ్యక్తి బాలుడ్ని నిర్బంధించి దాడి చేశాడు. దుకాణానికి వెళ్లి వాసు ఎంతకు తిరిగి రాకపోవటంతో.. వాసు తల్లిదండ్రులు, బంధువులు దుకాణం వద్దకు వెళ్లారు. తమ కుమారుడు ఎక్కడని ఓబుల్​ రెడ్డిని ప్రశ్నించారు. మీ పిల్లవాడు మా ఇంట్లో దొంగతనం చేశాడని, మీరు మళ్లీ మా ఇంటికి వచ్చి అడుగుతారా అంటూ.. బాలుడు తండ్రితోపాటు అక్కడికి వెళ్లిన బంధువులపై ఓబుల్​ రెడ్డి దాడికి దిగాడు. దీంతో వారు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో ఆదినారయణ రెడ్డి అనే వ్యక్తి.. బాలుడి పెద్దనాన్న ఇంటిపై దాడికి దిగాడు. ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా తమపై దాడికి దిగిన వారు ఊరి విడిచి వెళ్లాలని నానా దుర్బాషలాడారని బాధితులు ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details