ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Asha_ Worker_ Died_ in_ Jagananna_ Arogya_ Suraksha

ETV Bharat / videos

Asha Worker Died in Jagananna Arogya Suraksha : మృతురాలికి న్యాయం చేయాలని ధర్నాకు దిగిన ఆశా కార్యకర్తలు.. అరెస్టు - ap politics latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 12:42 PM IST

Asha Worker Died in Jagananna Arogya Suraksha :గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో కుప్పకూలి చనిపోయిన ఆశా కార్యకర్త కృపమ్మకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అధికారుల పని ఒత్తిడితోనే కృపమ్మ ప్రాణాలు కోల్పోయిందని..  ఆమె కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ  తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు, యూనియన్ నేతలు బైటాయించారు. మృతురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమపై పని భారం తగ్గించాలని, సెలవులు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆశా వర్కర్ల ఆందోళనకు తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను, తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. 

ఆశా కార్యకర్తలతో పగలు, రాత్రీ తేడా లేకుండా పని చేయిస్తున్నారని.. తోటి కార్యకర్తలు తెలిపారు. ఉదయం 7 గంటలకల్లా అందరూ విధుల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడంతో అల్పాహారం తీసుకోకుండానే విధులకు హాజరయ్యామని చెప్పారు. విధులకు వచ్చిన కృపమ్మ 11 గంటల సమయంలో కళ్లు తిరిగి కిందపడిపోయారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details