ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Arudra Deeksha

ETV Bharat / videos

Arudra Deeksha: సీఎం మాట కంటే.. మంత్రి గన్​మెన్ మాటే చెల్లుతోంది: ఆరుద్ర - Arudra hunger strike

By

Published : Jun 19, 2023, 4:06 PM IST

Arudra Deeksha: సీఎం జగన్​ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ విశాఖ జీవీఎంసీ వద్ద కాకినాడకు చెందిన ఆరుద్ర నిరాహార దీక్ష చేస్తున్నారు. తన కుమార్తె ఆరోగ్యం కోసం కొన్ని నెలల నుంచి ఆరుద్ర పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు కూడా చేశారు. జగన్​ కూడా హామీ ఇచ్చారు.  ఆ హామీని నెరవేర్చాలని చాలా సార్లు సచివాలయం చుట్టూ తిరిగింది. తాజాగా విశాఖలో నిరాహార దీక్ష చేపట్టింది. ఆరుద్రకు వికలాంగుల హక్కుల పోరాట సమితి మద్దతుగా నిలిచింది. తన బిడ్డ సాయి చంద్రకు వైద్య సహాయం అందించాలని, పోలీసుల తీరు వల్ల తన బిడ్డకు ఈ దుస్థితి పట్టిందని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో సీఎం మాట కంటే.. మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ మాట చెల్లుతోందని, పోలీసులు నుంచి తనకు రక్షణ కావాలని కోరుతున్నారు. డీఎస్పీ మురళీ కృష్ణ, మంత్రి దాడిశెట్టి రాజా గన్​మెన్​లను పోలీసు శాఖ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని.. అప్పటివరకు నిరాహార దీక్ష కొనసాగిస్తా అని ఆరుద్ర స్పష్టం చేశారు.
 

ABOUT THE AUTHOR

...view details