ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Archery Jyothi Surekha Parents Reaction: బంగారు పతకాలు సాధించడంపై.. జ్యోతిసురేఖ ఫ్యామిలీ రియాక్షన్ - ap news

🎬 Watch Now: Feature Video

Archery Jyothi Surekha Parents Reaction

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 5:42 PM IST

Updated : Oct 7, 2023, 6:57 PM IST

Archery Jyothi Surekha Parents Reaction: ఆసియా క్రీడల్లో భారత క్రీడా కారులు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా తెలుగు తేజం వెన్నం జ్యోతిసురేఖ ఆర్చెరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల ఆర్చెరీ ప్రయాణంలో ఈ ఏడాది సురేఖకు ఎంతో గొప్ప సంవత్సరంగా అభివర్ణించారు. దేశం గర్వపడేలా వందకుపైగా పతకాలు సాధించిన క్రమంలో... సురేఖ ఆ జాబితాలో ఉండడం తమకు చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు శ్రీదుర్గ, సురేంద్రకుమార్‌ తెలిపారు. 

 ఆసియా క్రీడల్లో మూడు పతకాలు రావడం తమకు గర్వకారణంగా ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఈ విజయం కోసం తమ కుమార్తె అహర్నిశలు కృషిచేసిందని వెల్లడించారు. 13 ఏళ్ల అనుభవం చైనా, కొరియా లాంటి దేశాలను ఏవిధంగా ఎదుర్కొవాలో ఉపయోగపడిందని తెలిపారు. జ్యోతిసురేఖ త్వరలో జరగబోయే ఏషియన్ ఛాంపియన్స్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో  జరిగిన వివిధ టోర్నమెంట్లలో జ్యోతిసురేఖ ఏకంగా 11 మెడల్స్ సాధించిదని సురేంద్రకుమార్ వెల్లడించారు.

Last Updated : Oct 7, 2023, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details