APSRTC Higher Pension Scheme: ఆర్టీసీ ఉద్యోగులకు అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ అధిక పింఛను విధానం
Implementation of APSRTC Higher Pension Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిసున్న వారికి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ అమలు చేస్తోన్న హయ్యర్ పింఛన్ విధానం.. అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవలే ఉద్యోగులకు ఈపీఎఫ్ హయ్యర్ పింఛన్ విధానాన్ని వర్తింపజేసిన ఆర్టీసీ.. అర్హులైన 40 వేల ఉద్యోగులకు నిర్థిష్ట గడువులోగా పత్రాలను అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు.
హయ్యర్ పింఛన్ విధానం అమలు..ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ అమలు చేస్తోన్న హయ్యర్ పింఛన్ విధానం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు అమల్లోకి వచ్చింది. ఇటీవలే ఆర్టీసీ.. ఉద్యోగులకు ఈపీఎఫ్ హయ్యర్ పింఛన్ విధానాన్ని వర్తింపజేసింది. ఈ క్రమంలో అర్హులైన 40 వేల ఉద్యోగులకు నిర్థిష్ట గడువులోగా పత్రాలను అప్‌లోడ్ చేసింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సత్యనారాయణ అనే ఉద్యోగికి తొలి హయ్యర్ పింఛన్ ఆమోద పత్రం జారీ అయింది. దీంతో ఆ ఆమోద పత్రాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉద్యోగికి అందించారు.
మరికొద్ది రోజుల్లో అందరీకి ఆమోద పత్రాలు.. అనంతరం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ..''సత్యనారాయణకు హయ్యర్ పింఛన్ నెలకు 25 వేలుగా ఈపీఎఫ్ఓ నిర్ధరించింది. దేశంలో ఏ ఆర్టీసీకి లేని విధంగా ఏపీలో హయ్యర్ పింఛన్ దక్కింది. మరికొద్ది రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఆమోద పత్రాలు అందుతాయి. 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు అపాయింట్ అయి సర్వీసులో ఉన్న వారు, అలాగే ఆ తేదీలోపు రిటైరైన వారికి ఈ హయ్యర్ పెన్షన్ స్కీం వర్తిస్తుంది''. అని అన్నారు.