ఆంధ్రప్రదేశ్

andhra pradesh

APSRTC NMU Leaders Letter to Central PF Commissioner

ETV Bharat / videos

APSRTC NMU Leaders Letter to Central PF Commissioner: బకాయి చెల్లించని ప్రభుత్వం.. హయ్యర్ పెన్షన్​ను కోల్పోవాల్సిన పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు - ఏపీఎస్​ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 12:17 PM IST

APSRTC NMU Leaders Letter to Central PF Commissioner: ఆర్టీసీ ఉద్యోగులు హయ్యర్ పెన్షన్‌కు నగదు చెల్లించే గడువు మరో 3 నెలలు పొడిగించాలని ఎన్​ఎంయూ కోరింది. న్యూదిల్లీలోని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (Central Provident Fund Commissioner) నీలం షామిరావును.. ఆర్టీసీ ఎన్ఎంయూ (National Mazdoor Union) నేతలు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు లేఖ రాశారు. సెప్టెంబర్​లో 2 వేల మంది ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ కోసం నగదు చెల్లించేందుకు డిమాండ్ నోటీసులు అందాయని, సెప్టెంబర్ నెలాఖరులోపు హయ్యర్ పెన్షన్ కోసం నిర్ణీత మొత్తం చెల్లించాలని నోటీసుల్లో.. పీఎఫ్ ట్రస్ట్ తెలిపిందని లేఖలో నేతలు తెలిపారు. గడువులోపు కేవలం 15 వందల మంది ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే హయ్యర్ పెన్షన్ కోసం నగదు చెల్లించారని, నోటీసులు తీసుకున్న వారిలో 500 మంది ఉద్యోగులు డబ్బు లేక హయ్యర్ పెన్షన్​కు దరఖాస్తు చేయలేకపోయారని కమిషనర్​కు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఉద్యోగులకు బకాయిలు రావాల్సి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. 2017 వేతన సవరణ, ఎస్​బీటీ, లీవ్ ఎన్ క్యాష్​మెంట్ల బకాయిలు రావాల్సి ఉందని.. NMU నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 800 కోట్లు బకాయిలు ఉద్యోగులకు రావాల్సి ఉందన్నారు. బకాయిలు విడుదల చేయని పరిస్థితుల్లో ఉద్యోగులు హయ్యర్ పెన్షన్​ను కోల్పోవాల్సిన దుస్ధితి వస్తోందని లేఖలో పీఎఫ్ కమిషనర్​కు తెలిపారు. ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తే ఉద్యోగులు నగదు చెల్లిస్తారని తెలిపారు. పరిస్ధితి అర్ధం చేసుకుని హయ్యర్ పెన్షన్​కు నగదు చెల్లించాల్సిన గడువు మరో 3 నెలలు పెంచాలని, తద్వారా ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ పొందేలా అవకాశం కల్పించాలని కమిషనర్​ను ఎన్ఎంయూ నేతలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details