ఆంధ్రప్రదేశ్

andhra pradesh

apsrtc_door_delivery_monthly_celebrations

ETV Bharat / videos

APSRTC Door Delivery Monthly Celebrations: అక్టోబర్​ 26నుంచి ఏపీఎస్​ఆర్టీసీ డోర్​ డెలివరి మాసోత్సవాలు - RTC Parcel Courier Service

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 10:39 PM IST

APSRTC Door Delivery Monthly Celebrations: రాష్ట్రంలో ఏపీఎస్​ఆర్టీసీ "డోర్ డెలివరి” మాసోత్సవాలను నిర్వహిస్తోంది. అక్టోబర్​ 26వ తేది నుంచి నవంబర్​ 25వరకు ఆర్టీసీ నిర్వహిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. ఆర్టీసీ ద్వారా పార్శిల్​, కొరియర్​ డెలివరిలను ప్రొత్సహించేందుకు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆర్టీసీ తెలిపింది. సామాన్యులు సైతం వెచ్చించె స్థాయిలో ధరలను నిర్ణయించినట్లు ఆర్టీసీ వివరించింది. పార్శిల్​, కొరియర్​ వంటి వాటిని ఆర్టీసీ ఇకపై డోర్​ డెలివరి చేయనుంది.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రంలోని  84 ప్రధాన నగరాలతోపాటు పట్టణాల్లో వేగంగా.. విస్తృతంగా డోర్​ డెలివరి సేవలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా డోర్​ డెలివరి వ్యవస్థను విస్తృతం చేయటానికే.. ఈ “డోర్ డెలివరి” మాసోత్సవములను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. ఈ సేవలను హైదరాబాద్​లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. అందుకు హైదరాబాద్ నగర పౌరులు తమ పార్శిల్, కోరియర్లను ఆంధ్రప్రదేశ్​కు పంపించాలనుకుంటే.. ఏపీఎస్​ఆర్టీసీ హైదరాబాద్​ అధికృత ఏజెంట్ల ద్వారా బుక్​ చేసుకోవాలని సూచించింది. పార్శిల్​, కొరియర్​ డోర్​ డెలివరి ఛార్జీలను ఆర్టీసీ ఒక కేజీ వరకు 18 రూపాయలు వసూలు చేయనున్నట్లు వివరించింది. 6 కేజీల వరకు 30 రూపాయలని.. 10 కిలోల వరకు 36 రూపాయలు, 25కిలోల వరకు 48 రూపాయలు, 25 నుంచి 50 కిలోల వరకు 59రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వివరించింది. 

ABOUT THE AUTHOR

...view details