ఆంధ్రప్రదేశ్

andhra pradesh

apsp_sports_meet

ETV Bharat / videos

ఘనంగా ఏపీఎస్పీ 14 బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ - ఉల్లాసంగా గడిపిన ఉద్యోగులు - APSP Sports Meet in Anantapur District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 1:01 PM IST

APSP 14 Battalion Sports Meet Closing Ceremony:అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులోని ఏపీ స్పెషల్ పోలీస్ 14వ బెటాలియన్​లో స్పోర్ట్స్ మీట్ ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీఎస్​పీ- డీఐజీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. సంవత్సరంలో 4 రోజులపాటు తోటి ఉద్యోగులతో కలిసి ఉల్లాసంగా ఆటలు ఆడటం ఆనందాన్నిస్తుందన్నారు. పోలీసుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడం కోసం ఏటా పోలీసు అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్ జరుపుతుందని తెలిపారు. 

దాదాపు 150 మంది ఈ స్పోర్ట్స్ మీట్​లో పాల్గొన్నారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అందరు స్పోర్ట్స్ మీట్​లో భాగస్వాములు అవ్వడం వల్ల ఇక్కడ పండుగ వాతావరణంలా ఉందన్నారు. డ్యూటీలు చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల సిబ్బంది ఒత్తిడికి గురవుతుంటారు. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి తగ్గించడం కోసం ప్రతి సంవత్సరం పోలీస్ అసోసియేషన్ సిబ్బంది స్పోర్ట్స్ మీటింగ్ జరిపించి సిబ్బందికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details