APPSC Group 1 Ranker Manasa Selected as DSP: గ్రూప్ 1 ఫలితాల్లో మెరిసిన దంత వైద్యురాలు మాసన.. డీఎస్పీగా బాధ్యతలు - group 1 Ranker Manasa Kaduluru Interview
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 10:45 PM IST
APPSC Group 1 Ranker Manasa Selected as DSP : ప్రజాసేవ చేయాలనేది ఆ యువతి ఆశయం. అందుకే వైద్యురాలిగా ఉన్న ఆమె..పట్టుదలతో చదివి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. ఫలితంగా వైద్యురాలి నుంచి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది ఆమె (Group 1 Ranker Manasa Kaduluru Interview). భవిష్యత్‌లో మంచి సమాజాన్ని చూడాలంటే ఇప్పుడున్న సమాజంలో మార్పు తీసుకు రావాలంటోంది నెల్లూరు జిల్లాకు చెందిన కాదులూరు మానస. మిలటరీలో దంత వైద్యురాలిగా పని చేస్తూనే ఇటీవల వెలువడిన ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఫలితాల్లో డీఎస్పీగా మానస ఎంపికైంది. చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగే సంఘటనలతో ప్రభావితమై యూనిఫాం సర్వీసులోకి వెళ్లాలని ధృఢంగా నిశ్చయించుకున్న మానస.. పట్టుదలగా శ్రమించి అనుకున్నది (APPSC Group 1 Rankers Success Stories) సాధించింది. ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయక ఇంట్లో పెట్టుకున్నారా అంటూ తన తల్లిదండ్రులను సమాజం సూటిపోటి మాటలతో వేధించినా.. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛతో తన కెరీర్‌కు బంగారు బాటలు వేసుకుంది. ఓ వైపు వైద్యవృత్తిని నిర్వహిస్తూనే.. మరోవైపు పరీక్షలకు సన్నద్ధమైంది. అది కూడా ఎలాంటి శిక్షణ తీసుకోకుండా. మరి, ఇదంతా తొలి ప్రయత్నంలోనే తనకేలా సాధ్యమైంది.? తనని ప్రోత్సాహించి ముందుకు నడిపిందెవరు.? ఇలాంటి వివరాలను తన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు..