APNGO Association Name Change: ఏపీఎన్జీఓ అసోసియేషన్ పేరు మార్పు.. గెజిటెడ్ ఉద్యోగులకూ సభ్యత్వం - APNGO Association Name Change
APNGO Association Name Change: ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఏపీఎన్జీఓ సంఘ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌లో గెజిటెడ్ అధికారులకూ సభ్యత్వం ఇచ్చేలా బైలాలో మార్పులు చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం తెలిపింది. ఇక నుంచి ఏపీ నాన్‌గెజిటెడ్, గెజిటెడ్ సంఘంగా మారబోతున్నట్లు ఏపీఎన్జీఓ సంఘం నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఏపీఎన్జీఓ అసోసియేషన్‌ను ఏపీ ఎన్జీఓజీఓ అసోసియేషన్‌గా పేరు మార్చాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని.. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మార్పులు జరుగుతాయన్నారు. లక్షా 30 వేల మంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు, 30 వేల మంది గెజిటెడ్ ఉద్యోగులు సభ్యులుగా చేరనున్నట్లు తెలిపారు. తమ మెంబర్ షిప్ అధికంగా పెరగడం వల్ల రాష్ట్రంలో 5, జిల్లాల్లో 2, తాలూకాలో 2 పోస్టులు పెంచుతున్నట్లు వెల్లడించారు. 26 బ్రాంచీలుగా తమ ఏపీఎన్జీఓజీఓ సంఘం మారనుందన్నారు. ప్రభుత్వం తమ బైలా ఆమోదించిన తరువాత ఈ మార్పులు జరుగుతాయని బండి శ్రీనివాసరావు ప్రకటించారు.