APJAC Chairman Bandi Srinivasa Rao Comments on Employees Problems: "ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారిందనుకుని పొరపాటు పడ్డాం" - ఏపీజేఏసీ బండి శ్రీనివాసరావు సీఎస్ వినతిపత్రం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 11:38 AM IST
APJAC Chairman Bandi Srinivasa Rao Comments on Employees Problems: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చే దాఖలాలు కనిపించడం లేదని.. ఏపీ జేఏసీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు విమర్శించారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారిందని అనుకుని పొరపడ్డామన్నారు. ప్రభుత్వం ఇదే విధంగా ఉద్యోగుల సమస్యల పట్ల మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే తగిన మూల్యం తప్పదేమో అనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, ధనంజయ్ రెడ్డిని కలిసినట్లు వివరించారు. వారిని కలిసి జీవోలు జారీ చేసి అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించినా.. ఎలాంటి స్పందన లేదని తెలిపారు.
ఉద్యోగులు తమ పిల్లల పాఠశాల ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రకటించినట్లుగానే దసరాకు డీఏ చెల్లించేలా చూడాలని సీఎస్‌కు వినతిపత్రం అందించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డీఏ చెల్లించాలని.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.