ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Congress Party Executive Meeting in Vijayawada

ETV Bharat / videos

మోదీ ప్రధానిగా ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు: మాణికం ఠాగూర్‌ - కాంగ్రెస్‌ పార్టీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 10:24 PM IST

APCC incharge Manickam Tagore visit Vijayawada:కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ తొలిసారి విజయవాడలో పర్యటించారు. ఆంధ్రరత్నా భవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. మాణికం ఠాగూర్‌ సమక్షంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్, సినీ నిర్మాత కల్యాణ్ చక్రవర్తి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ సమావేశంలో ప్రసంగించారు. రానున్న 90 రోజులు రాష్ట్రానికి చాలా కీలకమని అన్నారు. టీ20 మ్యాచ్‌ చివరి ఐదు ఓవర్లలో ఉన్నామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మారాలంటే ఈ సమయం చాలా ముఖ్యమని చెప్పారు.

 ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని ఆయన పేర్కొన్నారు. మెట్రోరైలు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్రాజెక్టులు వంటివి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు అన్నీ వస్తాయని వెల్లడించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details