ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Transco Hike Wages for Outsourcing Employees

ETV Bharat / videos

AP Transco Hike Wages for Outsourcing Employees: ఏపీ ట్రాన్స్ కో.. అవుట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాల పెంపు - ap transco outsourcing workers salariehike

By

Published : Aug 16, 2023, 4:50 PM IST

AP Transco Hike Wages for Outsourcing Employees :ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ ట్రాన్స్ కో సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్ కోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్లు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. హైస్కిల్డ్ , స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలను సవరించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. హైస్కిల్డ్ కార్మికులకు రూ.22,589 నుంచి రూ. 30,605కు, స్కిల్డ్ కార్మికులకు రూ.20,598 నుంచి రూ. 27,953 కు పెంపుదల చేసినట్టు పేర్కోంది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,144 నుంచి రూ.23,236 కు, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ. 16,473 నుంచి రూ.22,318కి పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఆగస్టు 9 తేదీన సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో 2018 పేస్కేళ్ల ప్రకారం 2 శాతం పెంపుదలకు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు అంగీకరించాయని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ కె.విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details