ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP Revenue Employees Association Elections

ETV Bharat / videos

AP Revenue Employees Association Elections: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ - Revenue Employees Association Elections

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 9:52 AM IST

AP Revenue Employees Association Elections: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు (Revenue Services Executive Elections) నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎన్నికల అధికారి పీవీ కృష్టారావు నోటిఫికేషన్ జారీ చేసినట్లు.. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీన విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్​లో మొత్తం 30 పోస్టులకు రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక జరగనుందని తెలిపారు. గత 60 ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఎన్నిక నిర్వహణ తేదీ మరుసటి రోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని.. ఎన్నిక అనివార్యమైతే 4 గంటల తర్వాత పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 17వ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 26 జిల్లాల కార్యవర్గాల ఎన్నికలు పూర్తి చేశామని.. ప్రతి జిల్లా నుంచి ఒకరికి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పిస్తామని వెల్లడించారు. తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గంలో మహిళలకు ఆరు పోస్టులు రిజర్వు చేశామన్నారు. అటెండర్ క్యాడర్ నుంచి ఒకరికి, డ్రైవర్ క్యాడర్ నుంచి ఒకరికి స్థానం కల్పిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details