AP Politicians Congratulates to National Award Winners: 'తెలుగు సినిమా గర్వపడే క్షణమిది..' జాతీయ అవార్డులపై ప్రముఖుల హర్షం - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 11:53 AM IST
AP Politicians Congratulates to National Award Winners: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 69వ జాతీయ అవార్డులు ఒక బొనాంజా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం వరుస అవార్డులు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చలనచిత్ర అవార్డులు సాధించిన విజేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్‌తో పాటు ఆర్ఆర్ఆర్, ఉప్పెన, కొండపొలం చిత్రబృందాలకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ అవార్డులు తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపును తెచ్చాయన్నారు. 69 వ జాతీయ అవార్డులకు ఎంపికైన తెలుగు నటీనటులు, కళాకారులందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ ఎంపికై తెలుగు సినీ చరిత్రను తిరగరాసి తగ్గేదేలే అని నిరూపించుకున్నారని కొనియాడారు. ఆర్ఆర్ఆర్, పుష్ప, కొండపొలం, ఉప్పెన చిత్రాలకి వివిధ కేటగిరీల్లో అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.