AP NGO ఓపీఎస్పీ వచ్చేవరకు ఏపీఎన్జీవో ఉద్యమిస్తుంది.. ఆగస్టు 21, 22 తేదీల్లో కౌన్సిల్ సమావేశాలు: బండి శ్రీనివాసరావు - outsourced employees
AP NGO Council meeting: ఆగస్టు 21, 22 తేదీల్లో విజయవాడలో జరిగే 21వ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఏలూరులోని ఏపీ ఎన్జీవోల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని.. వారి వేతనాలు పెంచేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ అలవెన్సులు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటి కల్లా పింఛన్ చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు ఓపీ ఎస్పీ వచ్చేవరకు ఏపీ ఎన్జీవో ఉద్యమిస్తుందని తెలిపారు. గతం నుంచి ఉద్యోగుల కౌన్సిల్ సమావేశాలకు అప్పటి ముఖ్యమంత్రులు హాజరవటం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలో ఈసారి సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు కూడా హాజరుకానున్నట్లు బండి శ్రీనివాసరావు తెలిపారు.