SC Commission Chairman Post: 'ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పదవి.. మాదిగలకు కేటాయించాలి' - AP MRPS State President Perupogu Venkateswara Rao
AP MRPS State President Perupogu Venkateswara Rao Madiga: ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పదవి ఆగస్టులో ముగుస్తున్నందున.. ఆ పదవిని మాదిగలకు కేటాయించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ.. డిమాండ్ చేశారు. విజయవాడలోని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి విభజన రాష్ట్రం వరకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్లుగా మాల సామాజిక వర్గానికే అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయని అన్నాయి. దీని కారణంగా మాదిగలకు భూసమస్యలు, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు వచ్చినప్పుడు ఛైర్మన్లుగా ఉన్న మాల సామాజిక వర్గం వ్యక్తులు.. మాదిగలకు ఎప్పుడూ న్యాయం చేయలేదని వెంకటేశ్వర రావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ విడదీసినట్లే.. ఎస్సీ కమిషన్ను కూడా విడదీసి.. మాదిగ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని పేరుపోగు హెచ్చరించారు. నామినేటెడ్ పదవులు ఇచ్చి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.