Minister Peddireddy Sensational Comment: నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి.. ఎంత మాట అన్నారంటే..! - Minister Peddireddy Ramachandra Reddy news
AP Minister Peddireddy Ramachandra Reddy who slipped his mouth: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ముఖ్యమంత్రిని చేస్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురికాగా.. ఆ వెంటనే మంత్రిని చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని అన్నారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి తడబాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వెండుగంపల్లిలో నేడు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభలో నోరు జారారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. ఆ వెంటనే నాలుక కరుచుకున్న పెద్దిరెడ్డి.. భరత్‌ను మంత్రిని చేస్తారని జగన్ హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని చెప్పబోయి.. ముఖ్యమంత్రినే చేస్తారంటూ మంత్రి నోరు జారాటం సంచనంగా మారింది. ఈ నేపథ్యంలో సభకు విచ్చేసిన గ్రామస్థులు మంత్రి మాటలు విని షాక్‌కు గురై, నవ్వుకున్నారు.